వైయస్ దృతరాష్ట్రుడు, జగన్ ధుర్యోధనుడు: బాబు

కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి కీలకపాత్ర పోషిస్తుందని, మమతాబెనర్జీ, ములాయంసింగ్ యాదవ్, నవీన్‌పట్నాయక్, జయలలిత వంటి ప్రాంతీయ పార్టీల నేతల ప్రభావం అధికంగా ఉందని అన్నారు. 30 ఎంపీ సీట్లు గ్యారంటీగా గెలుస్తామని చెప్పిన జగన్ పార్టీ సీట్ల బలం పది లేక 12 సీట్లకు దిగజారిందని చెప్పారు. మరికొన్ని రోజులు ఆగితే నాలుగైదు సీట్లు కూడా కష్టమేనని, పూర్తిగా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు..
వైయస్ రాజశేఖర రెడ్డి ధృతర్రాష్టుడని, వైయస్ పుత్రవాత్సల్యంతో జగన్ దుర్యోధనుడుగా మారారని, లక్ష కోట్లు సంపాదించి జైలుపాలయ్యారని, వైఎస్ అవినీతి గురించి అతని ముఖ్య కార్యదర్శి జన్నత్ హుస్సేన్, వ్యక్తిగత సహాయకుడు సూరీడు, ముఖ్య భద్రతా అధికారి రమేశ్ తదితరులు సిబిఐ ఎదుట వాంగ్మూలాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. మరణించిన తర్వాత కూడా వైయస్ ఆత్మ కెవిపి రూపంలో తిరుగుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కేసీఆర్ పక్కా బ్లాక్‌మెయిలర్ అని, కెసిఆర్‌ది ఫామ్‌హౌస్ పార్టీ అని ధ్వజమెత్తారు. వైయస్ అవినీతికి సహకరించిన మంత్రులు వెళ్లాల్సింది సచివాలయానికి కాదు జైలుకని ఆయన అన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత ఫొటోను దొంగల ఫొటోల పక్కన పెట్టడంపై నిరసన తెలపాలని ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications