ఎత్తుకెళ్లి అమ్మాయిని ముగ్గురు రేప్ చేశారు

Class 10 girl raped by 3 men in Delhi
న్యూఢల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో కీచక సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ప్రభుత్వం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు వాహనంలో ఎత్తుకెళ్లి సరోజినీ నగర్‌లోని ఫ్లాట్‌లో ముగ్గురు వ్యక్తులు మూడు గంటల పాటు రేప్ చేశారు. ఆ తర్వాత ఒంటి గంట ప్రాంతంలో అమ్మాయిని సరోజినీనగర్‌ మార్కెట్ వద్ద పడేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్ (28)ని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు రాహుల్ (23), అమిత్ (24) పరారీలో ఉన్నారు. న్యూఢిల్లీలోని అశోక్‌నగర్ పోలీసులు కిడ్నాప్, రేప్ కేసులు నమోదు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి - అశోక్‌నగర్‌లోని దల్లాపురా కు చెందిన అమ్మాయి బుధవారం ఉదయం 7 గంటలకు పాఠశాలకు వెళ్తున్న సమయంలో నల్ల స్కార్పియోలో వచ్చిన వ్యక్తులు ఆమెను అడ్డగించారు. బాధితురాలికి ప్రదీప్ తెలుసు. దీంతో మాట్లాడడానికి ఆ అమ్మాయి ఆగింది. వెంటనే అమ్మాయిని వాహనంలో ఎక్కించుకుని సరోజినీ నగర్‌లోని ఫ్లాట్‌కు తీసుకుని వెళ్లి ఒక్కరి తర్వాత ఒక్కరు ఆమెపై అత్యాచారం చేశారు.

బాధితురాలు ఆటోలో ఇంటికి చేరుకుని విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. పోలీసులు మరో ఇద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+