షాక్: విమానంలో ఆరు పాములతో వ్యక్తి, అరెస్టు

పాములను తీసుకుని వచ్చిన వ్యక్తిని మొహమ్మద్ అజరుద్దీన్‌గా గుర్తించారు. అతను ఉత్తర చెన్నైలోని మన్నాడికి చెందినవాడు. అజరుద్దీన్ థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో వచ్చినట్లు అధికారవర్గాలు చెప్పాయి. చెన్నైలోని ఓ వ్యక్తికి అందించడానికి తన మిత్రుడు వాటిని తనకు అప్పగించినట్లు అజరుద్దీన్ చెప్పాడు. పరిణామాల గురించి తనకు తెలియదని అతను చెప్పాడు.
అజరుద్దీన్‌తో పాటు బ్యాగేజీని వైల్డ్‌లైఫ్ క్రైమ్ బ్యూరోకు అప్పగించారు. పైథాన్లను థాయ్‌లాండ్‌లో పెంచుకుంటారని, వాటితో ప్రమాదం లేదని అజరుద్దీన్ చెప్పాడు. వాస్తు జీవులుగా వాటిని అమ్ముతారని, అవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయని నమ్ముతారని అతను వివరించాడు.
థాయ్‌లాండ్ నుంచి అరుదైన మొక్కలను తెచ్చి ఉంటాడనే అనుమానంతో అధికారులు బుట్టను తెరిచారు. అతని నుంచి ఆరు పాములను, ఆరు ఎలుకలను, ఉడుతలను స్వాధీనం చేసుకున్నారు. అతను తెచ్చినవాటిలో రెండు గ్రీన్ పైథాన్స్, రెండు కోరల్ పాములు, మరో రెండు పైథాన్లు, నాలుగు ఎగిరే ఉడుతలు, రెండు థాయ్‌లాండ్ ఎలుకలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications