పరిశీలనలో తెలంగాణ: షిండే, బెంగళూర్ పేలుడుపైనా

బెంగళూర్ పేలుడుపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు దర్యాప్తులో ప్రగతి ఏమీ లేదని షిండే చెప్పారు. పేలుడు జరిగిన స్థలంలోని సిసిటివీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులను, కుట్రదారులను గుర్తించి, కేసులు పెడతామని ఆయన చెప్పారు. ఉగ్రవాద దాడులు ఇంకా ఎక్కడ జరుగుతాయనే సమాచారం లేదని ఆయన అన్నారు.
పేలుడుకు వాడిన బైక్ ఎవరిదనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారని చెప్పారు. తమిళనాడు పోలీసుల సహకారంతో బైక్ యజమానిని గుర్తించినట్లు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని రాజకీయాలు చెప్పితే తాము భద్రత కల్పిస్తామని చెప్పారు. బెంగళూర్ వంటి నగరాల్లో భద్రత పెంచామని షిండే చెప్పారు.
రాష్ట్రాలకు గత మూడు నెలలుగా కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోందని ఆయన చెప్పారు. మెట్రోపాలిటన్ సిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని కూడా తాము చెబుతూ వస్తున్నామని అన్నారు. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోసం చూస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications