మహిళను రేప్ చేసి అర్థనగ్నంగా రోడ్డుపై పడేశారు

దక్షిణ ఢిల్లీలోని నానక్‌పురా గురుద్వారా వద్ద రోడ్డుపై ఆమె సరిగా స్పృహ లేని స్థితిలో కనిపించింది. ఆ స్థితిలో ఆమెను చూసినవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో ఆమె సరిగా మాట్లాడలేని స్థితిలో ఉంది. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు తనను అపహరించారని మాత్రం చెప్పగలిగింది.
ఆమె ఎర్ర ఇటుకతో నేపాల్, రేప్, కోట్ల ముబారక్‌పూర్ అనే మేూడు పదాలను రోడ్డుపై రాసి చూపించింది. మహిళ కోట్ల ముబారక్‌పూర్ ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్నారు. ఆమెను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 20 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఆమెకు పెళ్లయినట్లు చెబుతున్నారు.
ఈ సంఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదు. మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications