'ప్రిన్స్'తోను జగన్' గేమ్స్: మోహన్ బాబు సయ్యాట

జూనియర్ ఫోటోను తమ ఫ్లెక్సీలలో ఉపయోగించడం కృష్ణా జిల్లాలో మొదలై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు విస్తరించింది. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఫోటోలను జగన్ పార్టీ ఉపయోగించుకోవడంపై టిడిపి మండిపడగా ఆ పార్టీకి చెందిన హరికృష్ణ, కేంద్రమంత్రి పురంధేశ్వరిలు మాత్రం భిన్నంగా స్పందించారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోను ఎవరైనా ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో మాత్రం తెలియకుండానే జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై నిన్న మొన్నటి వరకు చర్చోపరచ్చలు జరిగాయి.
తాజాగా మహేష్ బాబు ఫోటోను కూడా ఉపయోగించి మరోసారి జగన్ పార్టీ చర్చకు తెరలేపింది. మంత్రి గల్లా అరుణ కుమారి హీరో మహేష్ బాబుకు బంధువులు. దీంతో వారు కాంగ్రెసు పార్టీకే మద్దతిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఓ సమయంలో మహేష్ బాబును గల్లా అరుణ కుమారి రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు హీరో కృష్ణ జగన్ పార్టీలోకి వెళ్తారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ బాబు ఫోటోను ఉపయోగించడం కాంగ్రెసులో చర్చకు దారి తీసింది.
మోహన్ బాబు డైలామా!
ఇక, ఈ రోజు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కూడా దూమారం రేపాయి. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానని, పార్టీ పెట్టే ధైర్యం లేదని చెబుతూనే కుర్ర హీరోలకు చురకలు అంటించారు. ఒక్క సినిమా హిట్ కాగానే కొందరు ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతున్నారని, సినిమాలు వేరు రాజకీయాలు వేరని సుద్దులు చెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని అన్నారనే చర్చ సాగుతోంది.
మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో టిడిపిలోకి వెళ్లే అంశాన్ని కొట్టి పారేయలేమంటున్నారు. ఆయన మనసులో ఏముందో కొద్ది రోజులు ఆగితే కాని తెలియదు. అయితే, ఒక్క సినిమా హిట్ అయితే సిఎంలా ఫీల్ అవుతున్నారనే వ్యాఖ్యలు మాత్రం చర్చకు దారి తీశాయి. ఇటీవల హీరో జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబు, బాలయ్యలకు బలప్రదర్శన చేశారనే వార్తలు వచ్చాయి. ఈ కోణంలోను చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications