వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాటుడే పర్సనాలిటీస్: జగన్ ఫస్ట్, లిస్ట్‌లో కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaganmohan Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర పేర్లు ఉన్నాయి. ఇండియా టుడే తన తాజా సంచిక(ఏప్రిల్ 30, 2013)లో భారత్, ఆంధ్రప్రదేశ్‌లోని పదిమంది ప్రభావశీలురు అంటూ జాబితాను విడుదల చేసింది. రాష్ట్రానికి సంబంధించిన వారిలో జగన్, కెసిఆర్ తదితరులు ఉన్నారు. ఈ జాబితాలో జగన్ తొలి స్థానంలో ఉన్నారు.

ప్రస్తుత రాజకీయాలతో పాటు బంగారం ధరలు పడిపోవడానికి గల కారణాలను ఇండియా టుడే తన తాజా సర్వేలో పేర్కొంది. బంగారం ధరలు పడిపోవడం వల్ల బంగారం వ్యాపారులు, బులిటన్ డీలర్స్ ఇతర వ్యాపారాలపై ఎలా పడిందని వివరించారు. ఇటీవలె జ్ఞానపీఠ్ పొందిన రావూరి భరద్వాజ గురించి రాశారు. విశాఖపట్నం సీటు తనదే అంటున్న రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి, ఆ స్థానం నుండి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు కథానాయిక అంజలి అంశాలను పొందుపర్చారు.

అలాగే రాష్ట్రంలోని అత్యంత ప్రభావశీలురలంటూ పదిమంది పేర్లను పేర్కొంది. పలు అంశాలను పరిగణలోకి తీసుకొని వారి పేర్లను ప్రభావశీలురుగా పేర్కొంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర రావు, వి దినేష్ రెడ్డి, జివి ప్రసాద్, బివిఆర్ మోహన్ రెడ్డి, సి. పార్థసారథి, బుద్ధప్రసాద్, డాక్టర్ జి.సురేందర్ రావు, జి.మహేష్ బాబు, పి.గోపిచంద్‌లు ఈ వరుసలో ఉన్నారు.

గతేడాది అంటే 2012 మే 27వ తేది నుంచి జగన్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్నా రాష్ట్రంలో అధికార కాంగ్రెసు పార్టీకి బలమైన సవాలుదారుగా మారారని ఇండియా టుడే పత్రిక పేర్కొంది. గతంలో ఇండియా టుడే తన కథనంలో జగన్ జైల్లో ఉన్నా రాష్ట్ర రాజకీయాలతో పాటు, జాతీయ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి అవుతారని పేర్కొంది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy and TRS chief K Chandrasekhar Rao are India Today's top regional personalities list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X