ఆ తర్వాతే సిబిఐకి నోటీసులు: జగన్ పిటిషన్‌పై సుప్రీం

జగన్ కేసులో ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్ పైన విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. సిబిఐకి నోటీసులు జారీ చేయాలని జగన్ తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. జగన్ బెయిల్ పైన విచారణ జరిపిన తర్వాతనే సిబిఐకి నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం తెలిపింది. వాదనలు వినకుండా సిబిఐకి నోటీసులు జారీ చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. సమయం లేనందునే విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
కాగా, తనకు బెయిల్ ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని స్వీకరించిన కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. సమయం లేనందున ముప్పయ్యవ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications