ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అక్కడే ఉంటే జగన్‌తో పాటు జైల్లో 420 ఇచ్చేవారు!'

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Maganti Babu
హైదరాబాద్: తాను కాంగ్రెసు పార్టీలో ఉండి ఉంటే జైలుకెళ్లేవాడినని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాగంటి బాబు సోమవారం అన్నారు. కాంగ్రెస్ నుంచి తప్పుకున్నందుకే తాను జైలు పాలు కాలేదని, జడ్పీటిసి ఎన్నికల్లో ఒక్క స్థానం ఓడినందుకు వైయస్ రాజశేఖర రెడ్డి తనను మంత్రివర్గం నుంచి తప్పించారన్నారు.

తాను ఆ పార్టీలో ఉంటే జైలుకెళ్లే వాడినని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్కన చంచల్‌గూడ జైల్లో తనక్కూడ ఖైదీ నెంబర్ 786 లేదా 420 ఇచ్చేవారన్నారు. బయ్యారం, ఓబుళాపురం గనులు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టి వైయస్ కుటుంబం కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడిందని ఆరోపించారు.

మంత్రిపై చంద్రావతి ఫిర్యాదు

రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ శాసనసభ్యురాలు చంద్రావతి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చంద్రవతి మీడియాతో మాట్లాడారు. రాంరెడ్డిలో అహంభావం పెరిగిపోయిందని, దొరలా వ్యవహరిస్తున్నారని, బాంచన్ కాల్మొక్తా దొర అనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తన నియోజకవర్గంలో పనులేమీ జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా తనకు కనీసం సమాచారం ఇవ్వడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యేగా తనకు ఉండే హక్కులను ఆయన కాలరాస్తున్నారని, ఖమ్మం జిల్లాలో ఆయన తీరుపై పలువురు ఎమ్మెల్యేలు మదనపడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఆయన తన తీరును మార్చుకోవాలన్నారు. మంత్రిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు. త్వరలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తానన్నారు.

English summary

 Telugudesam Party senior leader Maganti Babu has blamed YS Rajasekhar Reddy family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X