అందరు చూస్తుండగా కారులో వచ్చి తల్లి, పిల్లల కిడ్నాప్

బాపూజీనగర్‌లో ఓ ప్రైవేట్ దుకాణంలో కలెక్షన్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం హరిసింగ్ చౌహాన్ ఉద్యోగానికి వెళ్లగా కుమారుడు భగవాన్ బయట ఆడుకుంటున్నాడు. 4.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తెల్లటి కారులో వచ్చి భగవాన్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఇది చూసిన స్థానికులు విషయాన్ని కుసుమ్‌కు చెప్పారు. కుమార్తె భగవతిని ఎత్తుకొని కుసుమ్ బయటకు పరిగెత్తుకు వచ్చింది.
కారును అడ్డగించేందుకు ప్రయత్నించింది. దుండగులు కారు ఆపి వారిద్దరిని కూడా కారులో ఎక్కించుకు పారిపోయారు. స్థానికులు హరిసింగ్ చౌహాన్‌కు ఫోన్ చేసి చెప్పారు. తన భార్య, ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు కుసుమ్ వద్ద ఉన్న ఫోన్ సిగ్నల్స్, గూగుల్ మ్యాప్స్ ద్వారా వారు ఎటువైపు పోతుంది గమనించారు.
తమను కారు ఢిక్కీలో బంధించారని కుసుమ్ తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా వారి కారు నాంధేడ్, నిజామాబాద్ మీదుగా రాజస్థాన్ ప్రయాణిస్తున్నట్టు నిర్ధారించారు. నాలుగు ప్రత్యేక బృందాలను పంపించారు. అక్కడి పోలీసులనూ అలర్ట్ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాజస్థాన్‌లోని తోజాపూరుకు చెందిన ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసులు ఓ అనుమానితుడిని విచారిస్తున్నారు.
నగరంలోని అల్వాల్‌లో కార్తి అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అతను బిటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదృశ్యమైన కీర్తన ఆచూకీ లభ్యం
నిజామాబాద్ జిల్లాలో కనిపించకుండా పోయిన కీర్తన అనే ఇంటర్ విద్యార్థిని ఆచూకీ లభ్యమైంది. కామారెడ్డిలో అదృశ్యమైన కీర్తన ముంబైలో ప్రత్యక్ష్యమైంది. తల్లిదండ్రులు మందలించిన కారణంగానే ఆమె వెళ్లినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ముంబైలోని చర్చిగేటు పోలీసు స్టేషన్‌లో కీర్తనను ఉంచారు. తల్లిదండ్రులు, పోలీసులు ఆమెను తీసుకు వచ్చేందుకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications