మోత్కుపల్లిపై ఫైర్: కడియం శ్రీహరికి మూడినట్లే?

శనివారంనాడు మోత్కుపల్లి నర్సింహులు కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు సమాధానంగానే శ్రీహరి నర్సింహులుపై విమర్శలు చేశారు. మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహింతంగా మెలుగుతున్నారు. ఈ స్థితిలో నర్సింహులుపై విమర్శలు చేస్తే ఎదురయ్యే పరిణామాలు కడియం శ్రీహరికి తెలియంది కాదు. తెలిసే ఆయన మోత్కుపల్లి వ్యాఖ్యలపై విరుచుకుపడినట్లు చెబుతున్నారు. పరిస్థితి ముదిరి, తాను పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడినా ఫరవాలేదనే నిర్ణయానికి కడియం శ్రీహరి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇటీవల జరిగిన తెలుగుదేశం తెలంగాణ ఫోరం సమావేశంలో కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు మీడియాకు లీక్ కావడంపై మోత్కుపల్లి విమర్శించారు. కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆయన తీవ్రంగా మండిపడ్డారు సమావేశంలో కడియం శ్రీహరి తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావును, మోత్కుపల్లి నర్సింహులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారని అంటున్నారు.
ఇది ఇద్దరు దళిత నేతల మధ్య ఆధిపత్య పోరు కాదని, తెలుగుదేశం తెలంగాణ ఫోరంలో తెలంగాణ వ్యతిరేక నాయకులున్నారని, తెలంగాణ వ్యతిరేక, తెలంగాణ అనుకూల నేతల మధ్య పోరాటమని, తనపై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య సమన్వయం లేదు. ఎవరి వర్గాన్ని వారు నడిపిస్తున్నారు. ఈ స్థితిలో నల్లగొండ జిల్లాకు చెందిన మోత్కుపల్లి నర్సింహులు ప్రవేశించి, కడియం శ్రీహరిపై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ నుంచి వెళ్లిపోవచ్చునని ఆయన అన్నారు. దీంతో కడియం శ్రీహరి తీవ్ర అగ్రహానికి గురై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications