నిరూపిస్తే యాత్ర ఆపేస్తా: బాబుకు షర్మిల సవాల్

గ్రామంలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తనకు ప్రమేయం లేని విషయాలను తనకు అంటగట్టడం మానుకోవాలని, ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని ఆమె చంద్రబాబుకు సూచించారు. రాజశేఖర్‌రెడ్డి ఐదున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివద్ధి చెందారని ఆమె అన్నారు. విలువలకు కట్టుబడి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను ఆయన ప్రవేశపెడితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని తుంగలోకి తొక్కిందని విమర్శించారు.
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం భారాలు మోపుతున్న చంద్రబాబు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలతో కోటలు కడుతున్నాడని ఆమె విమర్శించారు.
షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారంతో జగ్గయ్యపేట వద్ద కృష్ణా జిల్లాలో ముగిసింది. గత నెల 26న గుంటూరు జిల్లా నుండి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన ఆమె 28రోజులు పాదయాత్ర నిర్వహించి సోమవారం సాయంత్రం జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామం నుండి ఖమ్మం జిల్లా వల్లభి చేరారు. జిల్లాలో విజయవాడ నగరంతో పాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్రను పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications