జడ్జి ఎదుట రమ్య కన్నీళ్లు: సిటీలో భార్య కిడ్నాప్ ట్విస్ట్

రమ్యకు రక్షణ కల్పించాలని ఓ న్యాయమూర్తి లీగల్ సర్వీసెస్ అథారిటీ సెల్‌లో ఫిర్యాదు చేశారు. రమ్యకు రక్షణ కల్పించాలని, ఆమెను తెలుగు మహిళా ప్రాంగణానికి తరలించాలని లీగల్ అథారిటీ సెల్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, రమ్య తమ ఎదుట హాజరైందని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు సమాచారం అందించారు.
మూడు రోజుల క్రితం రమ్య అదృశ్యమైంది. దీంతో రమ్య కిడ్నాప్‌కు గురైందని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగా, పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు రమ్య బయటకు వచ్చి తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, సందీప్‌ను వదిలి పెట్టాలని, తమకు రక్షణ కల్పించాలని లీగల్ సెల్ అథారిటీని ఆశ్రయించారు.
పెళ్లి విషయం తెలియదు.. నాని
తన కూతురుకు గతంలో పెళ్లైన విషయం తనకు తెలియదని ఈలి నాని చెప్పారు. ఏ తండ్రి అయినా కూతురు బాగు కోసమే చూస్తారన్నారు.
హైదరాబాదులో కిడ్నాప్‌లో కొత్త ట్విస్ట్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోయినపల్లిలో సంచలనం సృష్టించిన తల్లి, ఇద్దరు పిల్లల కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. కుటుంబ గొడవల వల్లనే ఇది జరిగిందని పోలీసులు గుర్తించారు. తల్లి, పిల్లలు ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.
తనను తన భర్త కొట్టినందువల్లే తాను వెళ్లిపోయానని కుసుమ చెప్పినట్లుగా సమాచారం. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఉద్దేశ్యపూర్వకంగానే బయటకు వెళ్లానని వివరణ ఇచ్చారట. వారిని పోలీసులు మహారాష్ట్రలోని నాందేడ్‌లో గుర్తించారు.












Click it and Unblock the Notifications