ప్రసంగిస్తుండగా రోశయ్యకి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స

దీంతో ఆయనను ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానిక ఆసుపత్రికి తరలించారు. విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి ఆయన తరలించారు. రోశయ్యను మూడు గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోశయ్యకు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. రోశయ్య ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పార్థసారథి చెప్పారు.
తీవ్ర ఉక్కపోత వల్ల రోశయ్య అస్వస్థతకు గురయ్యారని, 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మూడు రోజులుగా విశ్రాంతి తీసుకోక పోవడం వల్లనే అస్వస్థతకు గురయ్యానని రోశయ్య చెప్పారు.
ఇంటర్ విద్యార్థిని క్షేమం
నిజామాబాద్ జిల్లాలో కనిపించకుండా పోయిన కీర్తన అనే ఇంటర్ విద్యార్థిని ఆచూకీ లభ్యమైంది. కామారెడ్డిలో అదృశ్యమైన కీర్తన ముంబైలో ప్రత్యక్ష్యమైంది. తల్లిదండ్రులు మందలించిన కారణంగానే ఆమె వెళ్లినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ముంబైలోని చర్చిగేటు పోలీసు స్టేషన్‌లో కీర్తనను ఉంచారు. తల్లిదండ్రులు, పోలీసులు ఆమెను తీసుకు వచ్చేందుకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications