అమెరికాలో మళ్లీ కాల్పులు: మహిళ సహా 5గురి మృతి

అధికారులు వెంటనే వాషింగ్టన్‌లోని ఫెడరల్ వేకు చేరుకున్నారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న సమయంలోను కాల్పులు కొనసాగుతున్నాయని ఫెడరల్ వే పోలీసుల అధికార ప్రతినిధి షెరాక్ తెలిపారు. అధికారులు తొలుత ఇద్దరు క్షతగాత్రులను గుర్తించారు.
వారి వద్దకు తుపాకీతో ఉన్న ఓ వ్యక్తి రావడాన్ని గమనించిన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో అనుమానితుడు మృతి చెందాడు. అదే సమయంలో అగంతకుడి కాల్పుల్లో గాయపడిన క్షతగాత్రులిద్దరు కూడా మృతి చెందారు. అనంతరం అధికారులు భవనంలో గాలింపు చేపట్టారు.
అక్కడ మరో వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. మరోచోట ఓ మహిళ మృతదేహం లభించింది. అయితే, ఈ మహిళ అనుకోకుండా కాల్పుల బారిన పడి ఉంటారని భావిస్తున్నారు. దర్యాఫ్తు కొనసాగుతోందని, అదనపు సాక్ష్యం కోసం అపార్టుమెంటులోని వారిని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications