విస్కీ సీసా కాదు: కెసిఆర్, జగన్‌కు రేవంత్ చురకలు

Revanth Reddy
విశాఖపట్నం: ముగ్గురు మూర్ఖులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు కలిసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా తయారు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి విశాఖ సభలో మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జనం కోసం జగన్ అని గతంలో చెప్పుకునే వారని, ఇప్పుడు జగన్ కోసం జైలు అని అనాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

ఆయన వేదికపైకి రాగానే ఈ జనసంద్రాన్ని చూసి పక్కనే ఉన్న ఆ సముద్రంలోని అలలు కూడా తలలు వంచాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకు అడ్డా అయితే.. అవినీతి అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్‌గా మారిందన్నారు. జనం కోసం జగన్.. జగన్ కోసం జనం అంటూ జఫ్ఫాగాళ్లు చెబుతున్నారని, అవన్నీ ఒట్టిమాటలని కొట్టేపారేశారు.

జగన్ ఫాలోవర్స్ అంతా జఫ్ఫాగాళ్లని వ్యాఖ్యానించారు. వారు ఇప్పుడు "జగన్ కోసం జైలు.. జైలు కోసం జగన్'' అని ప్రచారం చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో జగన్ కెడి నంబర్ వన్ అంటూ విమర్శించారు. జగన్ ప్రజా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లలేదని, అవినీతికి పాల్పడితే ప్రభుత్వమే జైల్లో వేసిందన్నారు. జగన్ కోసం చోటాలు జైలుకు వెళుతున్నారని, ఆయనేమైనా కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికుడా అని ప్రశ్నించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నంబర్ వన్ మూర్ఖుడు అని, ఆయన 420 బ్యాచ్‌కి నాయకత్వం వహిస్తున్నాడని 'మహారాజశ్రీ 420' అని వ్యాఖ్యానించారు. జగన్ సోదరి షర్మిల చేస్తున్న సవాళ్లు వానపాము బుస కొట్టినట్టుందన్నారు. కాగా టిడిపిని అంతం చేయడం ఇందిరమ్మ వల్లే కాలేదని, ఇప్పుడు తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల వల్ల ఏమవుతుందన్నారు. టిడిపి పనై పోయిందని చెబుతున్నారని, బీరు సాసీలో బీరు, విస్కీ సీసాలో విస్కీ కాదు తెల్లార్లు తాగితే ఖాళీ అయిపోవడానికి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ సెంటిమెంటుతో మరో నేత సొమ్ము చేసుకుంటున్నాడని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+