బంగారు తల్లి ఎఫెక్ట్: జట్టు కడుతున్న కిరణ్ వైరి వర్గం

Kiran Kumar Reddy - Botsa Satyanarayana - DL Ravindra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గం నేతలు ఒక్కటవుతున్నారు! కిరణ్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నివాసంలో మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జానా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు కిరణ్ ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కిరణ్ వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఒకరిద్దరు విభేదిస్తుంటారు: కొండ్రు

బంగారు తల్లి పథకంపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారని, ఏ విషయంలోనైనా ఒకరిద్దరు మంత్రులు విభేదిస్తుంటారని మంత్రి కొండ్రు మురళి వేరుగా అన్నారు. బయ్యారం గనుల కేటాయింపు విషయంలో రాజకీయ రాద్ధాంతం అనవసరమన్నారు. రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనులు కేటాయించినప్పుడు మాట్లాడని కెసిఆర్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు తెలంగాణ నేతలు కూడా బయ్యారం విషయంలో ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలకు ఈ విషయం చెప్పాలని భావిస్తున్నారు.

కొత్త పథకాలకు నిధులెక్కడివి: సోమిరెడ్డి

ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుండి తీసుకు వస్తారని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కొత్త పథకాలకు సొంత మంత్రివర్గం నుండి వ్యతిరేకత వస్తుందన్నారు. ముఖ్యమంత్రికి ఆయన మంత్రివర్గమే సహకరించడం లేదని, సొంత ప్రచారం కోసం సినిమా పేర్లు వచ్చేలా ప్రకటనలు గుప్పిస్తున్నారన్నారు.

కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలలోను రాష్ట్రం వెనుకబడిందన్నారు. బడ్జెట్ కేటాయింపులు, మంత్రివర్గ ఆమోదం లేకుండా ముఖ్యమంత్రి కొత్త పథకాలను ఎలా ప్రకటిస్తాన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి అవాస్తవాలు చెబుతున్నారన్నారు. కిరణ్ దళిత బంధువు కాదని, వ్యతిరేకి అని, ఆయనో రాబందు అని శంకర రావు స్వయంగా చెప్పారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+