చిరు సిఎం అనేది రామచంద్రయ్య అభిమతం: జెసి

ఉనికి కోసమే విజయమ్మ, షర్మిల విమర్శలు..
కాంగ్రెసు పార్టీని విమర్శిస్తేనే తమకు ఉన్నట్లుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వైయస్ విజయలక్ష్మి, షర్మిల వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు పథకాల విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శఇచారు. అధికారం కోసం వారు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.
కర్ణాటకలో మాదిరిగానే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెసు గాలి వీస్తోందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో లోకసభ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు గెలుస్తుందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పేర్లను మారుస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కొనసాగుతున్నాయని గండ్ర చెప్పారు. బెల్టు షాపులను క్రమేణా ఎత్తివేస్తామని, మద్యపాన నిషేధాన్ని దశలవారీ అమలు చేస్తామని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications