వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు వెన్నుపోటు వెనుక పురంధేశ్వరి: లక్ష్మీపార్వతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi, Purandeswari and Babu
హైదరాబాద్: పార్లమెంటు ఆవరణలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం అంశం నందమూరి కుటుంబంలో చిచ్చు రేపుతోంది. పార్లమెంటులో విగ్రహావిష్కరణకు తనకు ఆహ్వానం అందక పోవడంపై ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన భర్త ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవటం వెనుక కేంద్రమంత్రి పురంధేశ్వరి హస్తం ఉందన్నారు.

చంద్రబాబుకు ధైర్యం లేదు

చంద్రబాబుకు అంత ధైర్యం లేదని, పురంధేశ్వరి కారణంగానే వెన్నుపోటు జరిగిందన్నారు. ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో ఆవేదనకు లోనయ్యారని, దానికి పురంధేశ్వరే కారణమన్నారు. తన కుటుంబం తనను సరిగా చూడటం లేదనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నారన్నారు. తాను వచ్చాకే ఎన్టీఆర్ ఆరోగ్యం బాగయిందని, మళ్లీ అధికారంలోకి వచ్చారని లక్ష్మీ పార్వతి ఈ సందర్భంగా చెప్పారు.

పురంధేశ్వరి వెన్నుపోటును పలువురు అడ్డుకున్నారని కానీ, ఆమె మాత్రం తగ్గలేదన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పేరుతో హడావుడి చేస్తున్నారన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు కోసం తనకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా ఆహ్వానం అందాల్సిందే అన్నారు. తాను ఏం తప్పు చేశానని ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. తన తమ్ముడు అని బాలకృష్ణను పిలిచిన పురంధేశ్వరి వ్యక్తిగత కక్షతో తనను, చంద్రబాబును పిలవడం లేదన్నారు.

తనకు జరిగిన అన్యాయంపై తాను స్పీకర్ మీరా కుమార్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్‌కు లేఘఖ రాస్తానని చెప్పారు. తనకు న్యాయం జరగాల్సిందేనని ఆమె అన్నారు. కాగా, చంద్రబాబు అంటేనే మండిపడే లక్ష్మీ పార్వతి.. బాబుకు వెన్నుపోటు ధైర్యం లేదని, పురంధేశ్వరి వల్లనే జరిగిందని, బాబును కూడా విగ్రహావిష్కరణకు పిలవాల్సిందేనని చెప్పడం విశేషం.

English summary
NTR TDP president Laxmi Parvathi has questioned Central Minister Daggupati Purandeswari over NTR statue inaugaration in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X