హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహిత కాపురంలో చిచ్చు పెట్టిన టెక్కీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Techie Arrested
హైదరాబాద్: ఓ వివాహిత కుటుంబంలో చిచ్చు పెట్టిన ఐటి ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని రవిగా గుర్తించారు. వివాహిత పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి, అసభ్యకరమైన ఫొటోలు, మెసేజ్‌లు పోస్టు చేశాడనే ఆరోపణపై రవిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలావుంటే, సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. హేమాసింగ్ అనే యువతి గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హేమాసింగ్‌ను అరెస్టు చేశారు.

కాగా, ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసి బస్సు - బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడులో మంచినీళ్ల ట్యాంకర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ బాలుడు మరణించాడు. గ్రామంలో మంచినీరు దొరకడం లేదు. దీంతో మంచినీళ్ల ట్యాంకర్ రాగానే గ్రామస్థులు తోసుకున్నారు. ఈ తోపులాటలో గిరిజా శంకర్ అనే ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు.

English summary
An IT employee has been arrested by CID police in Hyderabad for cheating a married woman opening facebook account on her name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X