ఆ తప్పు మాత్రం చేయకు.. వైభవ్ సూర్యవంశీకి శ్రీశాంత్ వార్నింగ్!

భారత క్రికెట్ ప్రపంచంలో యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. ఐపీఎల్ 2026 సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన వైభవ్ సూర్యవంశీ.. అతి చిన్న వయసులోనే టీమిండియాలో స్థానం సంపాదించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం భారత్ తరఫున ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఎంపికైన టీ20 జట్టులో ఈ యువ ప్లేయర్ చోటు సంపాదించుకున్నాడు. అయితే ఈ తరుణంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో తన కెరీర్‌ను పోగొట్టుకున్న టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఈ యువ క్రికెటర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఇండియా ఏ జట్టు తరఫున దుమ్మురేపుతున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ కేవలం 24 బంతుల్లోనే 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్‌‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన శ్రీశాంత్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. "మనం వైభవ్ సూర్యవంశీని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఈ వయసులో వైభవ్ చూపిస్తున్న అంకితభావం, పట్టుదల నిజంగా అద్భుతం. మొదట సచిన్ మనకు దారి చూపించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వచ్చారు. కానీ వైభవ్ సూర్యవంశీ ఇంత చిన్న వయసులోనే సాధించినది ప్రతి ఒక్కరికీ ఆదర్శం" అని శ్రీశాంత్ కొనియాడాడు.

Sreesanth Warns Vaibhav Sooryavanshi Stay Away From Managers and Cricket Glamour Full Details

తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు, వివాదాలు చూసిన శ్రీశాంత్.. క్రికెట్ ప్రపంచంలో ఉండే చీకటి కోణాన్ని ప్రస్తావిస్తూ వైభవ్ సూర్యవంశీకి ఓ గట్టి హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చాడు. "వైభవ్.. నువ్వు గనక నా మాటలు వింటుంటే.. నీకొక పెద్ద రిక్వెస్ట్. ఈ ప్రొఫెషన్ మేనేజర్లను(పీఆర్ టీమ్స్) కాస్త పక్కన పెట్టు. కేవలం నీ ఆటపై మాత్రమే దృష్టి సారించు. నీ కెరీర్ విషయాలను నీ తండ్రి, నీ కుటుంబ సభ్యులు చాలా బాగా చూసుకోగలరు. క్రికెట్ చుట్టూ ఉండే ఈ తళుకుబెళుకులకు, బయటి వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండు" అని శ్రీశాంత్ సూచించారు. క్రికెట్ ప్రపంచంలో కనిపించే ఈ రంగుల ప్రపంచం ఎంతో మంది వర్ధమాన ఆటగాళ్ల కెరీర్లను నాశనం చేసింది.. అందుకే వైభవ్ సూర్యవంశీ జాగ్రత్తగా ఉండాలని శ్రీశాంత్ సూచించాడు.

ఈ హెచ్చరికల నడుమ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 26న ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ వేదికగా జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ బరిలోకి దిగే సువర్ణావకాశం ఉంది. ఈ ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే, జులై 1 నుంచి జులై 11 మధ్య ఇంగ్లాండ్‌తో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా వైభవ్ తన బ్యాటింగ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+