వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం రేసులో ఉన్నా, వారం పట్టొచ్చు: సిద్ధరామయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Siddaramaiah
బెంగుళూరు : తాను ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నానని కర్ణాటక కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఆయన సిద్ధ రామయ్య వరుణ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. దీంతో ఆయన నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బాణాసంచ కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని సిద్ధ రామయ్య చెప్పారు.

విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, ముఖ్యమంత్రి ఎంపికకు వారం రోజులకు పైగా పట్టవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బిజెపి తప్పిదాలతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు

కర్ణాటకలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంత్రం పని చేయలేదని, ఎన్నికల్లో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభావం స్పష్టంగా కనిపించిందని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్ కృషి వల్లే రాష్ట్రంలో తమ పార్టీ ఘన విజయం సాధించిందని ఆయన అన్నారు.

కాగా, ముఖ్యమంత్రి అభ్యర్థిని తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని కాంగ్రెసు మరో సీనియర్ నేత మల్లికార్జున ఖార్గే అన్నారు. మల్లికార్జున ఖార్గే కూడా ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎస్ఎం కృష్ణ, వీరప్ప మొయిలీ కూడా ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ విజయపథాన సాగుతున్న సమయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటక కాంగ్రెసు కార్యాలయాల వద్ద కాంగ్రెసు కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయం వద్ద కూడా సంబరాలు జరుగతున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కూడా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెసు నాయకులు ఆనందసముద్రంలో మునిగి తేలుతున్నారు.

English summary
Karnataka Congress senior leader and former CM Sidharamaiah said that he is in CM race and Congress high command will cecide the CM candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X