జగన్ పార్టీ పువ్వాడకు తెరాస గాలం, ఖర్చు పెడితేనే..?

మమత విద్యా సంస్థల అధిపతిగా ఉన్న అజయ్ కుమార్‌కు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇతర తెరాస నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయట. అజయ్ తనతో టచ్‌లో ఉన్నారని కెసిఆర్ కూడా చెప్పారట. అయితే, తాను తెరాసలో చేరేది లేదని, తాను తెలంగాణవాదినే కానీ... జగన్ వెంటే ఉంటానని పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలను కెసిఆర్ మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే, డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిందేనని, లేకపోతే స్థానాలు గల్లంతవుతాయని సంకేతాలిస్తున్నారట. ఖర్చు పెట్టగలిగే వాళ్లనే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా చూసుకుందామని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలూ జీరో అవుతాయని, తెలంగాణవాదానిదే హవా అవుతుందని కెసిఆర్ అన్నారు. సర్వే ఫలితాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని, పోలైన ఓట్లలో తెరాసకు 50% దక్కితే, అన్ని పార్టీలు మిగతా 50% ఓట్లను పంచుకుంటాయని చెప్పారు.
ఈసారి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే తేడా ఉండదని, తెలంగాణ అంతటా టీఆర్ఎస్ విజయబావుటా ఎగరవేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాలోనూ పార్టీకి నాలుగు అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని చెప్పారు. అక్కడ జగన్ పార్టీ నేత పువ్వాడ అజయ్ కుమార్ తనకు టచ్‌లో ఉన్నారని, ఆయన త్వరలో తెరాసలో చేరబోతున్నట్లు చెప్పారట. అజయ్ ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తారని చెప్పారట.












Click it and Unblock the Notifications