బాబుపై జగన్ పార్టీ: ఆనం సెటైర్, మావాడేనని శంకరన్న

చంద్రబాబు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణకు వెళ్లి తర్వాత కాలి నొప్పికి వైద్యం చేయించుకునేందుకు ఢిల్లీలో ఉంటే ఆయన బెయిల్‌ను అడ్డుకున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ పార్టీ నేతల తీరు మోకాలి గుండుకు, బోడిగుండుకు లంకె కట్టినట్లుగా ఉందన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంత అక్రమాలకు పాల్పడినా ఇంకా బెయిల్ వస్తుందని భావించిన వారు రాజకీయ అజ్ఞానులే అన్నారు. జగన్‌కు బెయిల్ రాకపోవడం ఆశ్చర్యమేమీ కాదన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌కు ఎప్పటికీ బెయిల్ రాదని అర్థమవుతోందన్నారు. జగన్ పార్టీ పేరును వైయస్సార్ కలెక్షన్ పార్టీ అని పెట్టుకుంటే బాగుండేదన్నారు. కోర్టుల ద్వారా ప్రజలు ఎంత చైతన్యవంతులయ్యారో కర్నాటక ఎన్నికల ఫలితాలను చూస్తే అందరికీ అర్థమవుతుందన్నారు.
జగన్ మావాడే... శంకర రావు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ వాడేనని మాజీ మంత్రి శంకర రావు అన్నారు. ఆయన ఎప్పటికైనా తమ పార్టీలోకే వస్తారన్నారు. కర్నాటక ప్రజలను అవహేళన చేసే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మాట్లాడుతున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications