వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలినొప్పికి థెరపీ: జగన్‌పార్టీ ఆరోపణలపై బాబు వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తమ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కోసం తాను ఢిల్లీకి వెళితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు దానిని రాజకీయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన తన నివాసంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. కర్నాటకలో కాంగ్రెసు పార్టీ నైతికంగా ఓడిందని, భారతీయ జనతా పార్టీ అవినీతి మకిలితో ఓడిందన్నారు.

ప్రధాని అసహాయత, కాంగ్రెసు పార్టీ వల్లే దేశంలో ఇన్ని కుంభకోణాలు జరిగాయన్నారు. ఆ కుంభకోణాలను కూడా కోర్టులు, లోకాయుక్తలు బయటకు తీసుకు వచ్చాయన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డిలు మైనింగ్ దోపిడీకి పాల్పడ్డారన్నారు. నాడు టిడిపి వారి మైనింగ్ దోపిడీపై పోరాడితే బిజెపి, కాంగ్రెసులు పార్లమెంటులో చర్చకు రాకుండా అడ్డుకున్నాయన్నారు. ఇప్పటికైనా బిజెపి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

మైనింగ్ మాఫియాపై టిడిపి పుస్తకం వేసిందన్నారు. వీటిని కేంద్రంలోని పెద్దలందరికీ ఇచ్చామన్నారు. రాష్ట్రాల సరిహద్దులు మార్చినా ప్రభుత్వాలు అప్పుడు స్పందించలేదన్నారు. ఆర్థిక నేరాలు పెరిగాయని, దేశ ఆర్థిక వ్యవస్థను ఇది నాశనం చేస్తుందని, వీటిపై కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని బాబు గుర్తు చేశారు. తాను ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం వెళ్లి అక్కడ కాలు నొప్పికి కీమో థెరపీ చేయించుకుంటే పిల్ల కాంగ్రెసు నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

ప్రజలను మభ్య పెట్టేందుకే జగన్ పార్టీ తనపై విమర్శలు చేస్తోందన్నారు. తన ఢిల్లీ పర్యటనను రాజకీయం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిమంత్రులను కాపాడుతున్నారని విమర్శించారు. టిడిపి అడ్రస్ లేకుండా గల్లంతు చేస్తానని ప్రగల్భాలు పలిగిన గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ కర్నాటకలో తుడిచి పెట్టుకుపోయిందన్నారు. యడ్డీ కులం సపోర్టు పేరుతో అవినీతికి పాల్పడినా నెగ్గలేదన్నారు.

English summary
Telugudesam party chief Nara Chandrababu Naidu has clarified about his Delhi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X