దెబ్బ మీద దెబ్బ: వైయస్ వేరు.. జగన్ వేరు(పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి భిన్నంగా ఉన్నారా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైయస్ ఎవరినైనా తన వాళ్లుగా భావిస్తే వారిని నెత్తిన పెట్టుకునే వారు. అలాంటి వారిపై ఆరోపణలు వచ్చినా మరేదేనా వారికి అండగా నిలిచేవారు. అయితే, జగన్ మాత్రం అలా కాదనే వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రులు కొండా సురేఖ, కొణతాల రామకృష్ణలపై పార్టీ అధిష్టానం వైఖరే అందుకు నిదర్శనమంటున్నారు. ఆనం సోదరులు, ఉండవల్లి అరుణ్ కుమార్, సబితా ఇంద్రా రెడ్డి, రఘువీరా రెడ్డి, అంబటి రాంబాబు, కొండా దంపతులు... ఇలా తన వాళ్లు అనుకుంటే వైయస్ వారి కోసం దేనికైనా సిద్ధమయ్యేవారు. వ్యక్తిగత కార్యదర్శి అయిన సూరీడునే తక్కువ చేయలేదంటున్నారు. అయితే జగన్ మాత్రం తండ్రి స్వభావానికి విరుద్దమంటున్నారు.
వైయస్‌కు చాలా సన్నిహితులైన పలువురు నేతలు కాంగ్రెసు నుండి జగన్‌తో వెళ్లక పోవడానికి కారణం ఆయన వైఖరే కారణమని కూడా అంటున్నారు. తండ్రి స్వభావానికి పూర్తి విరుద్దమని గుర్తించడం వల్లనే వారు వెళ్లలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ, కొణతాల, అంబటి వంటి నేతలు వచ్చినా వారు పూర్తిగా సంతృప్తిగా ఉన్నది లేదంటున్నారు.
వైయస్‌తో అన్నేళ్ల అనుబంధం పెనవేసుకున్నప్పటికీ వారు ఆయన పట్ల అసంతృప్తిని ప్రకటించిన సందర్భాలు లేవని, జగన్ వైఖరి పైన మాత్రం వారు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. నమ్మిన వారికి అండగా వైయస్ నిలువగా... మంత్రి పదవిని, కాంగ్రెసును వదులుకొని వచ్చిన కొండా, యనమలల వంటి నేతలకు మాత్రం పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే వారు అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు.
కొణతాల రాజకీయాల కోసం కాకుండా వైయస్ పైన అభిమానంతో జగన్ కోసం పార్టీలోకి వచ్చినా ఆయనతో ముప్పయ్యేళ్ల రాజకీయ వైరం ఉన్న దాడి వీరభద్ర రావును పార్టీలోకి చేర్చుకోవడం ఏమిటనే చర్చ సాగుతోంది. అందుకే వైయస్ పైన అభిమానంతో వచ్చిన వీరవిధేయులు కొందరు ఇప్పుడు పక్క పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు. ఇతర నేతల అసంతృప్తి ఎలా ఉన్నా మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచిన నేతల అసంతృప్తి పార్టీకి నష్టం కలిగిస్తుందని అంటున్నారు.

జైలులో ఉన్న జగన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు అలకవహిస్తుండగా... గురువారం బెయిల్ వస్తే జగన్ వాటిని సరిదిద్దుతారని భావిస్తున్న పార్టీ క్యాడర్‌కు సుప్రీం తీర్పు షాక్ ఇచ్చింది. సీనియర్ లీడర్ల అలకకు తోడు సుప్రీం తీర్పు జగన్ పార్టీలో మరింత నిరుత్సాహాన్ని నింపింది.

పార్టీ సీనియర్ నేతల అసంతృప్తి నేపథ్యంలో జగన్‌కు, వైయస్ రాజశేఖర రెడ్డికి పోలిక లేదనే వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి.

వైయస్‌కు అత్యంత సన్నిహితులైన కొండా దంపతులు మొదటి నుండి జగన్‌కు అండగా ఉంటున్నారు. కానీ వారికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కొండా దంపతులు జగన్ పట్ల అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో వైయస్‌కు, జగన్‌కు పోలిక లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ముప్పయ్యేళ్ల తన రాజకీయ శత్రువు దాడి వీరభద్ర రావును పార్టీలోకి తీసుకోవడం ద్వారా కొణతాల రామకృష్ణ కూడా పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు.

కడపలో మొదటి నుండి అండగా ఉన్న మైనార్టీ వర్గాలకు కాకుండా రవీంద్రనాథ్ రెడ్డికి, ఖమ్మం తదితర జిల్లాల్లో సీనియర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జగన్ పార్టీలో ఫైర్ బ్రాండులుగా పేరు పొందిన అంబటి రాంబాబు, రోజాలు సైతం పలుమార్లు అసంతృప్తికి గురైనట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications