కాంగ్రెస్ కొత్త అందుకే: రఘువీరాపై గంటాకు కిరణ్ చురక

ఇటీవల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఓసారి, మరోసారి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి తదితరులు భేటీ కావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గూడుపుఠాణీ జరుగుతుందని ప్రచారం జరిగింది.
బెల్టు షాపుల భరతం పట్టండి
బెల్టు షాపుల భరతం పడుతామని ఇప్పటికే ప్రకటించిన కిరణ్.. అనధికార మద్యం షాపులపై వేటుకు సిద్ధమయ్యారు. అసలెన్ని బెల్టు షాపులున్నాయనేది లెక్క తీయాలని అధికారులకు హుకుం జారీచేశారు. మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా మొదట బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించాల్సిందేనని గట్టిగా ఆదేశించారు. ఈ మేరకు ఆయన సమక్షంలో బుధవారం సచివాలయంలో జరిగిన ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారుల సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఒకటిన్నర నెలలోగా బెల్టు షాపులపై నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో బెల్టు షాపులు ఉన్నట్టు తమకు సమాచారం లేదని ఎక్సైజ్ శాఖ ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "రాష్ట్రంలో బెల్టు షాపులున్నట్లు సమాచారం లేదు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్మూలించాం. ఇంకా ఉన్నాయా అనేది తెలియదు. ఒకవేళ ఏమైనా మిగిలి ఉంటే సీఎం తాజా ఆదేశాల మేరకు వాటినీ తొలగిస్తాం'' అని మంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications