ఫొటో: షర్మిల తలలో మల్లెల మాల తురుముతూ..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర సాగిస్తూ ఉన్న విషయం తెలిసిందే. పాదయాత్రలో ఆమె వెంట పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఉంటున్నారు. షర్మిలకు తోడునీడగా ఆమె పాదయాత్రలో కొనసాగుతున్నారు. షర్మిలకు వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను కూడా ఆమెనే అందిస్తున్నట్లు చెబుతున్నారు. మహిళలకు మల్లె పూలంటే తెగ మక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే.
ఎండాకాలంలో మల్లెపూలు చల్లదనాన్ని, సువాసనను ప్రసాదిస్తాయి. వాసిరెడ్డి పద్మ షర్మిల తలలో మల్లెపూల మాల తురుముతూ ఉన్న ఫొటో ఒక్కటి ఫేస్‌బుక్కులో చక్కర్లు కొడుతోంది. షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు. ఆమె పాదయాత్ర గురువారంనాటికి 143వ రోజుకు చేరుకుంది.

షర్మిల తన పాదయాత్రను కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించారు. కాలికి శస్త్రచికిత్స అవసరం కావడంతో ఆమె పాదయాత్రకు మధ్యలో కొన్ని రోజులు విరామం ఇచ్చారు. ఆమె పాదయాత్ర కృష్ణా జిల్లా మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
షర్మిల పాదయాత్రకు ముందు వాసిరెడ్డి పద్మ పార్టీ అధికార ప్రతినిధిగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో తరుచుగా మీడియా సమావేశాలు పెట్టేవారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తప్పు పడుతూ ఆమె మాట్లాడుతుండేవారు. కాంగ్రెసు ప్రభుత్వంపై దండెత్తుతూ ఉండేవారు. షర్మిలను అనుసరిస్తున్నప్పటి నుంచి ఆమె మీడియా సమావేశాలు కరువయ్యాయి.












Click it and Unblock the Notifications