వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ క్యాంప్‌పై రాహుల్‌గాంధీకి ఫిర్యాదు: కెవిపి పైనేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు నేతలు పలువురు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసి పార్టీలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలపై ఫిర్యాదు చేశారు. మధుయాష్కీ, వి హనుమంత రావు, మంద జగన్నాథం తదితరులు రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

పార్టీలోనే ఉంటు కొందరు జగన్‌కు మద్దతిస్తున్నారని యాష్కీ, విహెచ్ లాంటి నేతలు ఫిర్యాదు చేశారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు పైనే వారు ఫిర్యాదు చేశారా? అనే చర్చ సాగుతోంది. విహెచ్, యాష్కీలు జగన్ విషయంలో ఎప్పుడు కెవిపిని టార్గెట్ చేసుకుంటారు. జగన్‌కు కెవిపి కోవర్టుగా వారు పలుమార్లు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో వారు కెవిపి రామచంద్ర రావు పైనే ప్రధానంగా ఫిర్యాదు చేసి ఉంటారని అంటున్నారు. అలాగే పథకాలు, తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మంద జగన్నాథం మంత్రి డికె అరుణ పైన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇక నుండి తరుచూ ఎంపీలతో సంప్రదింపులు జరుపుతానని, పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతానని చెప్పారు.

కాంగ్రెస్, టిడిపిలపై విజయమ్మ ఫైర్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కాంగ్రెసు, టిడిపిలపై మండిపడ్డారు. జగన్‌కు సుప్రీం బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెసు, టిడిపిలు కలిసి జగన్ పైన కుట్ర పన్నాయని ఆరోపించారు. సిబిఐ పని తీరును సుప్రీం కోర్టే తప్పు పట్టిందన్నారు. జగన్‌ను ఏడాదిగా జైలులో ఉంచారని, అంతకుముందు సాక్ష్యాలు తారుమారు చేయని వ్యక్తి ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

ప్రజలకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే వచ్చానని, ఈ మూడేళ్లు కష్టాలు ఉంటాయని, దానికి సిద్దపడ్డవారే తనతో రావాలని జగన్ గతంలోనే చెప్పారన్నారు. జగన్ బయట ఉన్నన్నాళ్లు ప్రజల కోసం పోరాటాలు చేశారని, ఇప్పుడు ఆయన సూచనల మేరకు తాము చేస్తున్నామన్నారు. ప్రజల కోసం ఏం చేసేందుకైనా వైయస్సార్ కాంగ్రెసు సిద్ధంగా ఉందన్నారు. కర్నాటకలో బిజెపిని ముక్కలు చేసి కాంగ్రెసు గెలిచిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

English summary
Congress Party senior leaders V Hanumantha Rao and Madhu Yashki were complained to Rahul Gandhi against YSR Congress Party chief YS Jaganmohan Reddy's camp congress leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X