'సుప్రీంకోర్టు తీర్పుతో గందరగోళంలో వైయస్ జగన్ పార్టీ'

Devineni Umamaheswara Rao - Yanamala Ramakrishnudu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన బెట్టింగులు జరుగడం దారుణం అని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లి ఆ తర్వాత కాలుకు కీమో థెరపీ చేయించుకుంటే... ఢిల్లీలో మకాంవేసి బెయిల్ రాకుండా కుట్ర పన్నారని జగన్ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

జూపుడి ప్రభాకర రావు వ్యాక్యలను తాము కోర్టు దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. జగన్ పార్టీ నేతలు బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు జగన్ పార్టీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ ఆయన జట్టు సభ్యులు ఆర్థిక నేరగాళ్లు అని, వారు దేశద్రోహుల కిందకే వస్తారన్నారు. బెయిల్ కోసం అహ్మద్ పటేల్ కాళ్లు పట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు జగన్ పార్టీకి చెంప పెట్టు అన్నారు.

వచ్చే ఎన్నిక్లలో వైయస్సార్ కాంగ్రెసు రెండు స్థానాలకు మించి గెలువదన్నారు. ఓఎంసి కోసమే వైయస్ రాజశేఖర రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డిలు తమ పార్టీకి చెందిన నేత పరిటాల రవిని చంపించారన్నారు. ఈడి కేసులో జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పాలన్నారు. జగన్ లాంటి వ్యక్తులు ప్రజల్లో ఉండేందుకు అనర్హులు అన్నారు. జగన్ లాంటి వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని లింగారెడ్డి అన్నారు.

జగన్ కేసు తీవ్రమైన ఆర్థిక నేరమని సుప్రీం వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని యనమల రామకృష్ణుడు అన్నారు. జూపూడి న్యాయవ్యవస్థను కించపర్చేలా మాట్లాడారన్నారు. కోర్టు ధిక్కారణ కిందకే ఆయన వ్యాఖ్యలు వస్తాయన్నారు. కోర్టులకు రాజకీయం అంటగట్టడం తగదన్నారు. కోర్టు తీర్పుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరింత గందరగోళంలో పడిందన్నారు. నేతలు తిరగబడి బయటకు వస్తారన్నారు. కర్నాటక ఫలితాలు, సుప్రీం వ్యాఖ్యలు అవినీతి అంతానికి నాంది అని పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చెంప పెట్టు అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు స్వాగతించదగ్గదే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+