ఫొటోలు: కరెంట్ సమస్యపై సిఎం కిరణ్ రెడ్డి హామీ
గుంటూరు: వచ్చే రెండు మూడు నెలల్లో విద్యుత్తు సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరులో ఆయన గురువారం రైతు సదస్సును ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
రైతుల వద్ద బియ్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు వస్తున్నారని చెప్పారు. యాభై శాతం రాయితీపై యంత్రపరికరాలను రైతులకు అందిస్తామని ఆయన చెప్పారు. అకాలవర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు రూ.1663 కోట్లతో ఇన్‌పుట్ సబ్సీడీని అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.
25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు చేరినప్పుడే పథకాలకు సార్థకత అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తామని ఆయన చెప్పారు.
కాగా, రైతు సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించడానికి వెళ్తున్న వామపక్ష రైతు సంఘాల ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. అమ్మ హస్తం, ఇందిరమ్మ కలలు, రైతు సదస్సుల పేరుతో ముక్యమంత్రి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఇటువంటి సదస్సుల వల్ల ప్రయోజనం శూన్యమని వారన్నారు.

గుంటూరు రైతు సదస్సులో ముఖ్యమంత్రిని భారీ పూలమాలతో సత్కరిస్తున్న దృశ్యం

జ్యోతి ప్రజ్వలనం చేసి రైతు సదస్సును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

రైతు సదస్సులో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

రైతు సదస్సులో అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి

లబ్ధిదారులకు ఇలా చెక్కు అందజేస్తూ ముఖ్యమంత్రి...

రైతు సదస్సు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా...












Click it and Unblock the Notifications