120 మంది ఎమ్మెల్యేలు నాతోనే ఉన్నారు: సిద్ధరామయ్య
బెంగళూర్: శానససభకు ఎన్నికైన కాంగ్రెసుకు చెందిన 120 మంది శానససభ్యులు కూడా తన వెంటే ఉన్నారని కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన పట్టుపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పరిశీలన చేయడానికి ఢిల్లీ నుంచి పరిశీలకులు వస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
శాసనసభ్యులు ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారనే విషయాన్ని పరిశీలకులు పార్టీ అధిష్టానానికి తెలియజేస్తారని ఆయన చెప్పారు. అధిష్టానం పరిశీలకులుగా ఎవరు వస్తున్నారనే విషయాన్ని ఆయన చెప్పలేదు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 121 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.

తాను ముఖ్యమంత్రి పదవికి బలమైన అభ్యర్థినని సిద్దరామయ్య బుధవారం చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెసుకు ఆధిక్యత వస్తుందనే నమ్మకం కుదిరిన మరుక్షణమే తాను ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నానని చెప్పారు.
కేంద్ర కార్మిక మంత్రి మల్లికార్జున ఖర్గే కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. తాను ముఖ్యమంత్రికి తగిన అభ్యర్థిని అధిష్టానం అనుకుంటే తనను ఎంపిక చేస్తుందని, తుది నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని ఖర్గే అన్నారు. దళితుడిగా మాత్రమే తనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications