వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలితాలపై యడ్డీ, గాలి హ్యాపీ: ఓట్ల చీలికపై అగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yeddyurappa and Gali Janardana Reddy
హైదరాబాద్/బెంగళూరు: రాబోయే రోజుల్లో బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఓఎంసి కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి గురువారం అన్నారు. గాలిని ఈ రోజు ఎసిబి కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తుండగా ఆయన మాట్లాడారు. శ్రీరాములుకు మంచి భవిష్యత్తు ఉందని, ఎన్నికల ఫలితాలపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. వచ్చే రోజుల్లో పార్టీ ఎదుగుతుందన్నారు.

ఆదరించారు: శ్రీరాములు

కర్నాటక ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరించి నాలుగు స్థానాలలో గెలిపించారని బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, బళ్లారి గ్రామీణ శాసనసభ్యుడు శ్రీరాములు అన్నారు. ఆయన గురువారం జైల్లో ఉన్న గాలిని కలిసేందుకు కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబుతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కొత్త పార్టీకి కొన్ని సమస్యలు ఉంటాయని, రాబోయే రోజుల్లో తమ పార్టీని ప్రజలు ఆదరిస్తారని శ్రీరాములు చెప్పారు.

పది శాతం ఓట్లు సాధించాం: యడ్యూరప్ప

కర్నాటకలో జరిగిన సాధారణ ఎన్నికలలో తమ పార్టీ పది శాతం ఓట్లను సాధించిందని కర్నాటక జనతా పార్టీ(కెజెపి) అధ్యక్షుడు, శికారిపురి శాసనసభ్యుడు బిఎస్ యడ్యూరప్ప అన్నారు. పార్టీని స్థాపించిన మొదటిసారే ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు సాధించడం తక్కువేమీ కాదని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఎదుగుతుందన్నారు.

కెజెపి భారీగా ఓట్లను చీల్చడం వల్లే కాంగ్రెసు గెలిచిందన్న వాదనలపై యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీని దెబ్బతీయలేదన్నారు. ఫలితాలతో తాను సంతృప్తి చెందానని, ఇక పార్టీని పటిష్టం చేస్తానని అన్నారు. తాము ఆరు స్థానాల్లో గెలిచి 29 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచామన్నారు.

English summary
Former Karnataka CM and KJP chief yeddyurappa on thursday rubbished speculations that his newly floated outfit KJP helped the Congress to register a thumping victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X