జమ్ము జైల్లో గాయపడ్డ పాక్ ఖైదీ సనావుల్లా మృతి

 Pakistani prisoner Sanaullah dies
చండీగఢ్: జమ్ము కాశ్మీర్‌లోని కోటబల్వాల్ జైలులో భారతీయ ఖైదీల దాడిలో గాయపడిన పాకిస్తాన్ ఖైదీ సనావుల్లా మృతి చెందాడు. ఈ నెల 3వ తేదిన తోటి ఖైదీల చేతిలో సనావుల్లా గాయపడ్డాడు. దీంతో అతనిని జమ్ము ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఉత్తమ చికిత్స కోసం అక్కడి నుండి చండీగఢ్ జైలుకు తరలించారు.

అక్కడ వారం రోజుల నుండి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న సనావుల్లా మృతి చెందాడని వైద్యులు ఆరున్నర గంటలకు వైద్యులు ప్రకటించారు. సనావుల్లా 1994 బస్సు పేల్చివేత కేసులో నిందితుడు. అతనికి వైద్యులు అత్యుత్తమ చికిత్సను అందించినా కాపాడలేకపోయారు.

సనావుల్లా మృతిని భారత్ పాకిస్తాన్‌కు తెలియజేసింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలని పాకిస్తాన్ డిమాండు చేసింది. సనావుల్లా వయస్సు 52. కాగా, సనావుల్లాపై దాడి పాకిస్తాన్‌లో ఖైదీగా ఉండి తోటి ఖైదీల చేతిలో గాయపడ్డ సరబ్‌జిత్ సింగ్ పైన దాడికి ప్రతిగా భావిస్తున్నారు.

సరబ్‌జిత్ సింగ్ ఇరవై మూడేళ్ల క్రితం భారత్ సరిహద్దు దాటి పాక్‌లోకి వెళ్లాడు. దీంతో అతనిని పాక్ సైన్యం పట్టుకుంది. అతనిని జైలుకు పంపించింది. ఆయనకు సంబంధం లేని కేసులను మోపి అతనిని ఇరవై మూడేళ్ల పాటు జైలులో ఉంచింది. ఇటీవల ఆయనపై జైలులో దాడి జరిగింది. చికిత్స పొందుతూ మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+