కర్ణాటక సిఎం: సిద్ధరామయ్య, మల్లికార్జున్ ఖర్గే పోటీ

దళిత నేత, కాంగ్రెసు చీఫ్ జి. పరమేశ్వర ఓటమితో సిద్దరామయ్యకు అవకాశాలు పెరిగినట్లు భావిస్తున్నారు. దిళత, ఓబిసి ఓటు బ్యాంకును కాంగ్రెసు వైపు మళ్లించడంలో మల్లికార్జున్ ఖర్గే కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనను ముఖ్యమంత్రిగా చూసేందుకు ఆ వర్గాల నేతలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వల్లనే కాంగ్రెసు పార్టీ గెలిచిందని సిద్దరామయ్య అంటున్ారు. తన వాదనను పార్టీ అధిష్టానం ముందు పెట్టేందుకు సిద్దరామయ్య గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే ఆసక్తిని ఖర్గే బహిరంగంగానే వ్యక్తం చేశారు.
ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన డికె శివకుమార్ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. బలమైన వొక్కలిగ కమ్యూనిటికీ చెందినవారు. కాగా, మాజీ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సీనియారిటీ కార్డును వాడుతున్నారు. శానససభ్యుడిగా 16 ఏళ్ల అనుభవం ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ పేరు కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications