వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమర్థుడివే: బాబుకు అంబటి కౌంటర్, ప్రధానిపై నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu and Chandra Babu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం సుప్రీం కోర్టు బెయిల్‌ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ పార్టీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడారు.

ఆయన రెండు రోజులు ఢిల్లీలో ఉన్నారని ఆయనే బెయిల్‌ను అడ్డుకున్నారని ఆరోపించారు. దీనికి చంద్రబాబు మాట్లాడుతూ.. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, సుప్రీం కోర్టును మేనేజ్ చేస్తానని జగన్ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. దీనికి అంబటి రాంబాబు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు. బాబు ప్రపంచంలో ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడన్నారు. బాబు జీవితమే మోసాల మయమని మండిపడ్డారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని మూసివేస్తే 2014లో తాము అధికారంలోకి రావొచ్చునని బాబు భావిస్తున్నారని, కానీ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. బాబు మూడోసారి కూడా ఓడిపోవటం ఖాయమన్నారు. టిడిపి జెండాలు పీకేయక తప్పదన్నారు. టిడిపి అంతర్థానమవుతుందన్నారు. ఎమ్మార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును సిబిఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.

మన్మోహన్ పైన నాగం

బొగ్గు కుంభకోణం కేసులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగే ప్రధాన నిందితుడు అని నాగర్ కర్నూలు శాసనసభ్యుడు, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. మన్మోహన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో ఓటమి చెందుతామని తెలిసినా బిజెపి యడ్యూరప్పను, గాలి జనార్ధన్ రెడ్డిని తొలగించిందన్నారు. అధికారం కోసం బిజెపి అవినీతిని ప్రోత్సహించదన్నారు. ప్రధానిని రక్షించేందుకే సిబిఐ నివేదికలో మార్పులు చేశారన్నారు.

విభేదాల కోసం కాదు: కృష్ణమూర్తి

2014 ఎన్నికల కసరత్తు కోసం ఏఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీ సమాయత్తమవుతున్నారని ఏఐసిసి పరిశీలకులు కృష్ణమూర్తి వేరుగా అన్నారు. అందులో భాగంగానే రాహుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. పథకాల విషయంలో మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారన్నారు. సిఎం, ఎంపీల మధ్య విభేదాల కోసం తనను పంపించలేదన్నారు. పార్టీ కార్యక్రమాల పైనే వచ్చానని చెప్పారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu alleged that TDP chief Nara Chandrababu Naidu can manage any system in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X