పోలింగ్ బూత్‌ల్లో వెబ్ కెమెరాలు పెట్టాలి: బాబు

ఈవియంల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిరూపించిన వ్యక్తిని జైలులో పెట్టారని, నమ్మిన విషయానికి కట్టుబడి ఈవియలంకు ప్రింటర్లు అమర్చాలని తాము సూచించామని, దాన్ని పరీక్షించి సాధ్యమేనని ఎన్నికల సంఘం నిర్ధారించుకుందని, 2014లో సాధ్యమైనంత ఎక్కువగా ఈ పద్ధతిని అనుసరించాలని తాము సూచించామని ఆయన వివరించారు. ఈ విషయంలో ఓ ముందడుగు వేశామని అన్నారు.
ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత పారదర్శకత కోసం ఓటింగులో ఐరిష్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. అయితే, ఎన్నికల్లో ధనప్రవాహాన్ని నియంత్రించలేకపోతున్నారని ఆయన అన్నారు. ఓటర్లను కొంటున్నారని, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని ఆయన అన్నారు. మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. నేరగాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని, నేరగాళ్లు రాజకీయాల్లోకి రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అననారు. ప్రజలు అవినీతిపరులను తిరస్కరించే స్థితికి వచ్చారని చంద్రబాబు అన్నారు. నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలిస్తే దేశంలో పేదరికాన్ని అంతం చేయవచ్చునని ఆయన అన్నారు.
వేయి రూపాయల నోట్లు వచ్చిన తర్వాత కోటి రూపాయలు కూడా జేబుల్లో పెట్టుకుని వెళ్లడానికి వీలవుతుందని, ఈ పద్ధతి మారాలని, లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలని ఆయన అన్నారు. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతామని తాము గత ఎన్నికల్లో ప్రకటించామని, నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటోందని, దాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై కేంద్రం అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications