సందేహం: జగన్ పార్టీలో కొణతాల ఉంటారా, పోతారా?

పార్టీ మారే అంశాన్ని ఈ సమయంలో మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు - "నేను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించినా వార్తలు వస్తున్నాయి. నేను ఢిల్లీకి వెళ్లి ఎవరినీ కలవాల్సిన అవసరంలేదు. మీరు ఎలా అనుకున్నా మంచిదే. నా పాలసీ నాకుంది. మీరనుకున్నది రాయండి'' అని అనేశారు.
అయితే తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటం లేదని సూటిగా చెప్పలేదు. తనతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపిన విషయాన్నీ ఖండించలేదు. ఆ రకంగా ఆయన కాంగ్రెసులోకి వెళ్లే ప్రత్యామ్నాయాన్ని సజీవంగా ఉంచుకున్నట్లు అర్థమవుతోంది. కాగా, కొండా దంపతుల అనుచరులపై పద్ధతి ప్రకారమే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్య తీసుకున్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కొణతాల రామకృష్ణను రాజకీయంగా అంతం చేసేందుకు దాడి వీరభద్రరావు వ్యూహం పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గండి బాబ్జీ ఆరోపించారు. డబ్బుల ప్యాకేజీ నేత అంటూ దాడిపై గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావుతో కుమ్మక్కైన దాడి డబ్బులు తీసుకొని కొణతాలను ఓడించారని ఆరోపించారు.
కొణతాల కుటుంబంలో చిచ్చుపెట్టి వర్తక సంఘం మూసివేతకు దాడి కారకులయ్యారని అన్నారు. కొణతాలకు చెందిన 80 ఎకరాల భూమిని అన్యాయంగా ఏపిఐఐసికి కట్టబెట్టారని, వారి కుటుంబసభ్యులకు చెందిన పూల్‌బాగ్ భూములను కబ్జా చేసేందుకు దాడి యత్నించారని బాబ్జీ ఆరోపించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు దాడి విచక్షణారహితంగా విమర్శలు చేశారని గుర్తుచేశారు. ఏ పదవి లేకున్నా కొణతాల పార్టీలో పనిచేస్తారని, దాడి ఆ విధంగా ఉండగలరా? అని ప్రశ్నించారు. దాడితో కొణతాల కలిసి పనిచేయడం అసంభవమన్నారు.












Click it and Unblock the Notifications