తెలంగాణ బిల్లు పెడుతుందో, చస్తుందో?: కాంగ్రెస్‌పై కిషన్

చలో అసెంబ్లీ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అందులో పాల్గొంటామని చెప్పారు. తెలంగాణపై పోరాటం చివరి దశకు చేరిందన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో తెలంగాణ బిల్లును పెడుతుందో లేదా చస్తుందో కాంగ్రెస్సే తేల్చుకోవాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు.
2014 ఎన్నికలలోపే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభింపజేసేలా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి కార్యాచరణను ఈ రోజు మధ్యాహ్నం ప్రకటిస్తామని కోదండరామ్ తెలిపారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు లక్ష్యంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తామని చెప్పారు. చలో అసెంబ్లీకి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయని ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో చెప్పారు.












Click it and Unblock the Notifications