థ్యాంక్యూ సోమచ్: సిబిఐకి విజయ సాయి కృతజ్ఞతలు

వాస్తవానికి ఈ నెల 31నే లొంగిపోవాలని తొలుత న్యాయమూర్తి జస్టిస్ సదాశివం తీర్పులో పేర్కొన్నారు. అయితే, కూతురి పెళ్లి పనులు చూసుకోవాల్సి ఉన్నందున మరికొంత గడువు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది రాజు రామచంద్రన్ ధర్మాసనాన్ని కోరారు.
దీనికి జస్టిస్ సదాశివం స్పందిస్తూ... మే 31వ తేదీ అంటే ఇంకా మూడు వారాల సమయం ఉందని, ఈ లోపు ఆయన ఏమైనా ఏమైనా చేయవచ్చుననే ఉద్దేశ్యంతోనే గడువు ముగిసే వరకు ఎవరితోను మాట్లాడవద్దని, ఎవరినీ సంప్రదించకూడదన్న నిబంధన విధించాలని భావించామని, కూతురి పెళ్లి ఉందని విజ్ఞప్తి చేయడంతో ఆ షరతును తొలగించామని, మళ్లీ గడువు పొడిగించాలంటే ఎలా? అని ప్రశ్నించారు.
దానికి సాయి లాయర్ రాజు రామచంద్రన్ స్పందిస్తూ.. కనీసం జూన్ 3-4 వరకైనా గడువు పొడిగించాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. అయితే, సిబిఐ అంగీకరిస్తేనే పరిశీలిస్తామని జస్టిస్ సదాశివం చెప్పడంతో అశోక్ భాన్ స్పందిస్తూ.. మానవతా దృక్పథంతో పరిశీలించొచ్చని చెప్పారు. దీంతో 5వ తేదీలోగా సాయి లొంగిపోవాలని జస్టిస్ సదాశివం ఆదేశాలు జారీ చేశారు.
తీర్పు వెలువడిన అనంతరం కోర్టు వరండాలో నిలబడ్డ భారతి, సాయిలు అశోక్ భాన్‌కు ఎదురుపడ్డారు. సాయిని ఉద్దేశిస్తూ.. కేవలం కూతురు పెళ్లి ఉందనే మానవతాదృక్పథంతోనే వారం రోజులు గడువు పెంచేందుకు అంగీకరించామని అశోక్ భాన్ అన్నారు. దీంతో థాంక్యూ సార్.. థాంక్యూ సోమచ్ అని సాయి అన్నారు.












Click it and Unblock the Notifications