కట్నం వేధింపుల కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్

Dowry Harassment
నెల్లూరు/ విశాఖపట్నం : నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ తుమ్మతాటి విజయకుమార్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. వెంకటాచలానికి చెందిన విజయ కుమార్ నెల్లూరుకు చెందిన శైలజను వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకునే సమయంలో శైలజ తల్లిదండ్రులు భారీగానే కట్నకానుకలు ఇచ్చారు.

వివాహమైన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ విజయకుమార్ భార్యను వేధించసాగాడు. వేధింపులు తాళలేక శైలజ పుట్టింటికి చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయకుమార్ తన సోదరుడు మరో నలుగురితో వచ్చి శైలజను కాపురానికి రమ్మన్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తన అనుచరులతో కలసి ఘర్షణకు దిగాడు.

అనంతరం విజయకుమార్ తదితరులు శైలజ తండ్రి రమణయ్యపై దాడి చేసి ఇనుప రాడ్లతో కొట్టారు. శైలజ ఫిర్యాదు మేరకు పోలీసులు విజయకుమార్‌పై వరకట్నపు వేధింపుల కేసు నమోదు చేసి రమణయ్యను ఆసుపత్రికి తరలించారు.

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

ఇదిలా వుంటే, విశాఖపట్న నగర పరిధిలోని మర్రిపాలెంలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో గురువారం తెల్లవారుజామున రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులే కారణమని తెలిసింది. రైల్వేలో బాక్స్‌బాయ్‌గా పనిచేసే వెల్లంకి నాగేశ్వరరావు మర్రిపాలెం రైల్వేకాలనీలో నివాసముంటున్నారు. ఈయనకు 2000 సంవత్సరంలో నాగిణితో పెళ్లయింది. వీరికి మోహన్‌కృష్ణ (10), తిరుమలరావు (8)) ఇద్దరు సంతానం. నాగేశ్వరరావు కొద్దిరోజులుగా భార్యతో తరుచుగా ఘర్షణ పడుతున్నాడు.

బుధవారం కూడా దంపతుల మధ్య గొడవ జరగగా సాయంత్రం పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన నాగిణి రాత్రయినా రాలేదు. గురువారం ఉదయం రైలుపట్టాలపై వీరు ముగ్గురు విగతజీవులై కనిపించారు. అర్ధరాత్రి దాటాక నాగిణి పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+