వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముదిరిన సంక్షోభం: కొండాకు మద్దతుగా రిజైన్ యోచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha and Konda Murali
వరంగల్: తమకు తెలియకుండానే తమ వర్గానికి చెందిన నలుగురు ఇంఛార్జులపై పార్టీ అధిష్టానం వేటు వేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము మొదటి నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటున్నప్పటికీ తమను టార్గెట్ చేసుకోవడమేమిటని మాజీ మంత్రి కొండా సురేఖ ఆవేదన చెందుతున్నారట.

కొండా దంపతులకు తెలియకుండానే వారి వర్గానికి చెందిన నలుగురిపై వేటు వేయడంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు వారికి మద్దతుగా రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట.

ఆయన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీతో ఈ రోజు భేటీ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డికి కూడా తెలియకుండా నలుగురి పైన వేటు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా మురళి, శ్రీనివాస్ రెడ్డిలు భేటీ కావడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మురళితో భేటీ అనంతరం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు రాజీనామా వార్తలను శ్రీనివాస్ రెడ్డి ఖండిస్తున్నారు. తాను జగన్ వెంటే ఉంటానని చెప్పారు.

కాగా, వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు ఇంఛార్జుల పైన పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. వారు నలుగురు కొండా సురేఖ వర్గానికి చెందన వారే కావడం గమనార్హం. జిల్లా మహిళా, మైనార్టీ, ట్రేడ్, ఎస్టీ ఇంఛార్జీ నేతలపై అధిష్టానం వేటు వేసింది.

English summary
Warangal distrit YSR Congress party convenor Srinivas Reddy has met Former MLC Konda Murali on Friday Morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X