'ఖల్ నాయక్'కు ఎదురుదెబ్బ: రివ్యూ పిటిషన్ తోసివేత

ముంబై పేలుళ్ల కేసులో దోషులు యూసుఫ్ మోసిన్ నుల్వాలా, ఖలీల్ అహ్మద్ సయీద్ అలీ నజీర్, మొహమ్మద్ దావూద్ యూసుఫ్ ఖాన్, షేక్ ఆసీఫ్ యూసుఫ్, ముజామిల్ ఉమర్ కాద్రీ, మొహ్మద్ అహ్మద్ షేక్ రివ్యూ పిటిషన్లను దాఖలు చేసుకున్నారు.
నిజానికి సంజయ్ దత్ ఏప్రిల్ 17వ తేదీలోగా లొంగిపోవాల్సి ఉంది. అతను మరో 42 నెలల పాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 1993 ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌ను దోషిగా నిర్ధారిస్తూ మార్చి 21వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు సంజయ్ దత్‌కు టాడా కోర్టు వేసిన ఆరేళ్ల జైలు శిక్షను ఐదేళ్లకు తగ్గించింది.
అక్రమంగా 9 ఎంఎం పిస్టల్‌ను, ఎకె - 57 రైఫిల్‌ను అక్రమంగా కలిగి ఉన్నందుకు సంజయ్ దత్‌ను టాడా కోర్టు దోషిగా నిర్ధారించింది. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మందికిపైగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications