యడ్యూరప్పకు, బిఎస్సార్ పార్టీకి బిజెపి బుజ్జగింపులు!

పార్టీకి దూరమైన యడ్యూరప్పను మళ్లీ దరిచేర్చి 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి సమాయత్తమయ్యేందుకు బిజెపి సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, రాజ్యసభ ప్రతిపక్షనేత అరుణ్ జైట్లీ ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది.
యడ్యూరప్ప లేకపోతే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి విజయాలు కష్టం కాగలవని భావిస్తున్న ఈ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇవి వాస్తవ రూపం దాల్చడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టవచ్చునని అంటున్నారు. యడ్డీకి మళ్లీ పార్టీ తీర్థం ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఆయనకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి అప్పగిస్తారట.లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అధికారం కూడా ఆయనకే కట్టబెడతారట.
బిజెపికి దూరమైన శ్రీరాములు వర్గాన్ని కూడా మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయట. ఇవన్నీ వాస్తవరూపం దాలిస్తే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిజెపి గట్టిపోటీ ఇవ్వడం తథ్యమని అంటున్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టాలంటే కర్ణాటకలో అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలవక తప్పదు. అయితే బిజెపిలో చేరే ప్రశ్నేలేదని యడ్యూరప్ప గురువారం కూడా స్పష్టం చేయడం విశేషం.












Click it and Unblock the Notifications