పాకిస్తాన్ ఎన్నికల్లో హింస, పేలుళ్లు: 17 మంది మృతి

వేడి దంచికొడుతున్నా ప్రజలు ఓటు వేయడానికి ఉత్సాహం చూపించారు. ఎన్నికల ద్వారా దేశంలో సంపూర్ణమైన మార్పులు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. దీంతో ఓటు వేయడానికి వారు పెద్ద యెత్తున ముందుకు వచ్చారు. కరాచీలో జంట పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లు అవామీ నేషనల్ పార్టీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. ఈ ఘటనలో 11మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు.
పెషావర్‌లోని ఓ పోలింగ్ బూత్ వెలుపల బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకర మరణించగా, 10 మంది మరణించారు. బెలూచిస్తాన్‌లోని సోరబ్ పట్టణంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద సాయుధులు ఇద్దరిని కాల్చి చంపారు. బెలూచిస్తాన్‌లోని చమన్ పట్టణంలో ఇద్దరు అభ్యర్థుల అనుచరులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మరణించారు.
ఎన్నికలకు ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 6 లక్షల మంది భద్రతాధికారులను నియోగించింది. ఏప్రిల్ నుంచి ఎన్నికలకు సంబంధించిన హింసలో ఆల్ ఖైదాతో కలిసి పనిచేస్తున్న పాకిస్తాన్ తాలిబాన్లు 120 మందిని చంపారు.












Click it and Unblock the Notifications