హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే ఫిర్యాదు: మానవ హక్కుల నేత జయ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మానవ హక్కుల సంఘం నేత జయ వింధ్యాలను ప్రకాశం జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల శాసన సభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు సికింద్రాబాదులోని పద్మరావు నగర్‌లో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రాన్స్‌ఫార్మార్ మరమ్మతు కేంద్రంలో ప్రమాదం

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలోని ట్రాన్సుఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రాన్సుఫార్మర్ ఆయిల్ పైన నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనలో మొత్తం 300 ట్రాన్సుఫార్మర్లు దగ్ధమయ్యాయి.

చెల్లి పెళ్లి రోజే గుండెపోటుతో అన్న మృతి

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పార్వతీపురం పట్టణంలో ఆదివారం ఓ చెల్లె పెళ్లి రోజో అన్న గుండె పోటుతో మృతి చెందారు. వరలక్ష్మికి ఆదివారం ఉదయం వివాహం జరిగింది. పెళ్లి పనులతో బిజీగా ఉన్న పెళ్లి కూతురు అన్న గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. కొద్ది గంటల్లోనే అతను చనిపోయాడు.

ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలు

కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడురులో ఓ ఎలుగుబంటు బీభత్సం సృష్టించింది. గ్రామంలోని నలుగురిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపర్చింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విశాఖ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యహ్నం ఒకటి గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ క్రేన్ దగ్ధమైంది. పక్కనే ఐదు వందల లీటర్ల డీజిల్ ఉండటంతో మంటలు మరింత ఎక్కువ చెలరేగాయి. ఈ ప్రమాదంలో రూ.18 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా.

English summary
Human rights activists Jaya Vindhyala was arrested by Prakasam district police in Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X