కరీంనగర్ టిడిపి నేత కూతురు వివాహానికి నారా లోకేష్

నారా లోకేష్ వెంట పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇనుగాల పెద్దిరెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జి ముద్దసాని కశ్యప్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనయుడి వివాహం హైదరాబాదులో జరిగింది. ఈ పెళ్లికి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.
మరోవైపు కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. శిల్పాసేవా సమితి చేపట్టిన పెళ్లి సంబరాలు కార్యక్రమంలో భాగంగా వారికి పెళ్లి వస్త్రాలు, సామాగ్రి, విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వధువరులను శిల్పా మోహన్ రెడ్డి దంపతులు ఆశీర్వదించారు.
అనంతపురం జిల్లాలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఉచిత సామూహిక వివాహాలు జరిగాయి. శ్రీమద్దానేశ్వరస్వామి ఆలయ సమీపంలో 310 మంది పేద జంటలను వేదమంత్రాల సాక్షిగా, మేళతాళాల మధ్య ఒక్కటి చేశారు.












Click it and Unblock the Notifications