వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ లిస్టులో ఎర్రబెల్లి?, అదే బాటలో మరికొందరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: వరంగల్ జిల్లా మాజీ మంత్రి కడియం శ్రీహరి తర్వాత అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకోనున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని తెరాసలో చేరనున్న కడియం శ్రీహరి కూడా చెప్పారు. ఎర్రబెల్లి తన దారికే వస్తారని ప్రచారం సాగుతోందని, అదే నిజమైతే ఆయన కోసం తాను అక్కడ ఎదురు చూస్తానని చెప్పారు.

తెలంగాణ విషయమై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి స్పష్టం చేయని పక్షంలో ఆ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో నూకలు చెల్లినట్లేనని ఆ ప్రాంత టిడిపి తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. దీంతో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని సమాచారం. పలువురు నేతలు తెలంగాణ కోసం పుట్టిన తెరాస, తెలంగాణవాదం గట్టిగా వినిపిస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరికపై మల్లగుల్లాలు పడుతున్నారట.

వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేస్తే గెలువలేమని చాలామంది తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. ఈ నేపథ్యంలో టిడిపిని వీడి తెరాస, బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఎక్కువమంది తెరాస వైపు మొగ్గుచూపుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే తెలంగాణ పేరుతో టిడిపి నుండి పలువురు బయటకు వెళ్లారు. మిగిలిన వారు తెరాసలో చేరారు. నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.

తాజాగా ఎర్రబెల్లి దయాకర రావు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికలకు ముందు ఆయన ఎప్పుడైనా పార్టీని వీడవచ్చునని అంటున్నారు. తెరాస నేతలు ఎర్రబెల్లితో చర్చలు కూడా జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే, ఈ మహానాడులో చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుంటేనే ఆయన పార్టీని వీడుతారని అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ముఖ్య నేత అయిన ఎర్రబెల్లి పార్టీని వీడితే మరికొంతమంది నేతలు ఆయన బాట పట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

English summary

 The rumors were spread all over Warangal district that TDP senior leader Errabelli Dayakar Rao may join in TRs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X