వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్లాస్ పీకి కొండా సురేఖకు హామీ ఇవ్వని వైయస్ జగన్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Konda Surekha
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిష్టానం పట్ల కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, కొండా మురళీ దంపతులు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ... తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడేది లేదని, విజయమ్మ, షర్మిలతో సమానంగా జగన్ తమను చూస్తున్నారని, ఆయనకు అండగా ఉంటామని ప్రకటించారు.

జగన్‌తో భేటీ అనంతరం కొండా దంపతులు చల్లబడినప్పటికీ వారికి అతని నుండి ఎలాంటి హామీ లభించలేదని చెబుతున్నారు. కేవలం ఇటీవల సస్పెన్షన్ వేటు వేసిన వారిని మాత్రం క్రమంగా దరి చేర్చుకుంటామని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతకుముంచి వారికి వరంగల్ జిల్లాలో ఆధిపత్యం పైన మాత్రం హామీ ఇవ్వలేదని సమాచారం. తమకు ప్రాధాన్యత ఉండటం లేదని భావించిన కొండా సురేఖ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.

ఇటీవల కొండా వర్గానికి చెందిన నలుగురు నాయకులు వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. వీటిని కొండా దంపతులు కొట్టిపారేస్తున్నారు. జగన్‌ను కలిసిన వారు ఎన్నో హామీలు ఇప్పించుకోవాలని భావించారట. కానీ తీరా భేటీ అయ్యాక జగన్ నుండి ఎలాంటి హామీ లభించలేదట. జిల్లా కార్యాలయానికి తాళం వేసిన నలుగురి పైన సస్పెన్షన్ వేటును క్రమంగా తొలగిస్తామని మాత్రం జగన్ చెప్పారట. పైగా వారికి పెద్ద క్లాస్ పీకారట.

మీరు ఇలా చేస్తారని తాను అనుకోలేదని, తోబుట్టువులా చూసుకుంటే ఇతర పార్టీలలో చేరుతానని లీకులు ఇవ్వడమేమిటని, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగేనా వ్యవహరించేదని వారిని జగన్ ప్రశ్నించారట. పార్టీలోనే కాకుండా అధికారంలోకి వస్తే మీ ప్రాధాన్యత మీకు ఉంటుందని చెప్పారట. జగన్ క్లాస్‌తో వెనక్కి తగ్గిన కొండా దంపతులు జిల్లా ఆధిపత్యంపై ఎలాంటి హామీ లేకుండానే బయటకు వచ్చి పార్టీని వీడమని చెప్పారని అంటున్నారు.

English summary
The YSR Congress party chief YS Jaganmohan Reddy has questioned attitude of former minister Konda Surekha and her husband Konda Murali, when they met him in Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X