వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమెడియన్‌కు ఎక్కువ.. మంత్రికి తక్కువ: హరీష్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మంగళవారం సెటైర్ వేశారు. ఆయన హాస్యనటుడికి ఎక్కువ, రాష్ట్ర మంత్రి హోదాకు తక్కువగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన పరిశ్ర్లమల ద్వారా తుంగభద్ర నదిని కలుషితం చేసిన వెంకటేష్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారన్నారు.

ఉద్యమంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు లేరని, కేవలం నాయకులే ఉన్నారంటూ ఆయన చెప్పడం విడ్డూరమని, ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. వెంకటేష్ మాటలు చూస్తుంచే సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోను జోకర్లు ఉంటారని ప్రజలు అనుకునే ప్రమాదం ఉందని అన్నారు.

ఆయన తన మనస్సు నిండా తెలంగాణ పట్ల వ్యతిరేకతను పెంచుకొని మనిషే కలుషితమయ్యారన్నారు. వెంకటేష్ విమర్శించినట్లు తాము రైటర్లం, హీరోలం, దర్శకులం కాదని, ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన స్ట్రయికర్లం, తెలంగాణ వ్యతిరేక శక్తులను తరిమి కొట్టగలిగిన షూటర్లం అన్నారు. మంత్రి ఇలాంటి మాటలు మానకపోతే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

టిఆర్ఎస్ నుండి రఘునందన్ రావు సస్పెన్షన్

మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎం రఘునందన్ రావును టిఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసినట్లు పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం ప్రకటించారు. పార్టీ ద్రోహానికి పాల్పడుతున్నందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. తాను మొదటి నుండి పార్టీ కోసం పని చేస్తున్నానని చెప్పిన రఘునంద రావు సస్పెన్షన్ పైన ఈ రోజు మాట్లాడే అవకాశముంది.

English summary
Telangana Rastra Samithi Siddipet MLA Harish Rao said that they are not writers.. but shooters and strikers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X